సత్తుపల్లి పట్టణం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిరసన దీక్ష
సత్తుపల్లి మార్చ్ 29 (); టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై సమగ్ర విచారణ జరుపాలని ,అందుకు భాద్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పిలుపుమేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈరోజు టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటలాడుతూ, ఏ నినాదంతో అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నియామకాల ఆపక్రియలో పేపర్ లీకేజీలు జరగటం దారుణమని విమర్శించారు., ఎట్టి పరిస్థితుల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని మరొక్కసారి ఇలాంటి తప్పులు జరగకుండా టీఎస్పీఎస్సీ జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులైన నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లీకేజీ ఘటనపై విచారణను హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జరిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు దుస్తా వెంకటేశ్వర్లు, సత్తుపల్లి టౌన్ అధ్యక్షుడు చిల్లపల్లి మాధవరావు,సత్తుపల్లి మండల అధయక్షుడు పామర్థి నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి గుడిద రామకృష్ణ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తినవలి రంగారావు, సత్తుపల్లి టౌన్ ప్రధాన కార్యదర్శి రాయల కోటి,జిల్లా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బెజవాడ సాయి శేషు, నియోజకవర్గ కార్యదర్శి వీరువాడ నాగభూషణం,నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కోట సత్యనారాయణ, యువజన విభాగం నాయకులు కోమటి తిరుమలరావు,విద్యార్థి విభాగ నాయకులు బజ్జురి మహేష్ తదితరులు పాల్గొన్నారు .