జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన మరియు జాతీయ స్థాయి మహిళ ప్రో కబడ్డీ పోటీల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కందాళ
ఖమ్మం ప్రతినిధి మార్చి 29 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళ చెరువు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా కూసుమంచి మండలం జీళ్ళచెర్వు గ్రామంలో ఈనెల 30 31 మరియు ఏప్రిల్ 1 తారీకు వరకు 3 రోజులు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటూరి శేఖర్ యువసేన నిర్వహించే జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన మరియు జాతీయస్థాయి మహిళ ప్రో కబడ్డీ పోటీల ఏర్పాట్లను పరిశీలించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పాల్గొని ఎద్దుల బల ప్రదర్శన మరి కబడ్డీ ఆటను విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం మరియు ఖమ్మం రూరల్ మండలం జడ్పిటిసి యెండపల్లి వరప్రసాద్ కుసుమంచి ఎంపీపీ బానోతు శీను నెలకొండపల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు