మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్ కుమార్*
మెదక్ ప్రజా బలం న్యూస్ :-
మున్నూరు కాపులకు కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరు కాపు సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడుతూ.. మున్నూరుకాపుల తమ న్యాయమైన హక్కుల కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా.. పరిష్కారం చేయకుండా దాటవేత ధోరణి అవలంభిస్తుందన్నారు. ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రూ. 5 వేల కోట్ల నిధులను కేటాయించాలన్నారు. లక్ష రూపాయల బీసీ పథకాన్ని మున్నూరు కాపులకు వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. కౌన్సిలర్ ఆవారి శేఖర్,వీర్ కుమార్, గడ్డం ప్రశాంత్ కుమార్,యువక మండలి జిల్లా కన్వీనర్ బోనగిరి చంద్రశేఖర్, మున్నూరు కాపు సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ హర్కార్ మహిపాల్, పట్టణ కోశాధికారి నాయిని ప్రసాద్, నల్లాల విజయ్ కుమార్, పెండల నిఖిల్, బోనగరి వినోద్ కుమార్, మున్నూరు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.