తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్
హైదరాబాద్ జూన్ 19; ముదిరాజ్ బిసి-డి నుండి ఏ గ్రూపులో మార్చాలని తెలంగాణ ముదిరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.నారాయణగూడలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జెఎసి కన్వీనర్ పోల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతి ప్రయోజనాల కోసం సమిష్టి నిర్ణయం తీసుకుంటామని కోరు కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది అదేవిధంగా బిసి-డి నుండి ఏ గ్రూపులో మార్చడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం త్వరలో చేపట్టబోతున్నామని అదేవిధంగా మత్స్యకారుల సమస్యల పైన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.ప్రభుత్వం నిర్ణయించిన బీసీ బందు లక్ష రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముదిరాజులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ కోర్ కమిటీ నిర్ణయించింది.ఈ కార్యక్రమంలో కోరు కమిటీ సభ్యులు జగన్మోహన్ ముదిరాజ్, సుధాకర్ ముదిరాజ్, గుండు నరసింహ ముదిరాజ్, మురళీకృష్ణ ముదిరాజ్, డాక్టర్ జగన్మోహన్ ముదిరాజ్, నీరజ ముదిరాజ్, పసుల విజయ్ కుమార్ ముదిరాజ్, ఉంగరాల రాజు ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, కోట్ల పుష్పలత ముదిరాజ్, కృష్ణ మనోహర్ ముదిరాజ్ పాల్గొన్నారు