రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి అభినందనీయం,
హరితహారంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటే జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా తెలంగాణ హరితోత్సవం,
తెలంగాణ హరితోత్సవంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,
కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూన్ 19:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించి భావితరాలకు మంచి ఆహ్లాదకరమైన మంచి వాతావరణం, గాలి అందించాలనే సదుద్దేశంతో చేపట్టారని ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైందని ఈ విషయంలో సీఎం కేసీఆర్ ముందుచూపు, దూరదృష్టి వల్ల పట్టణ ప్రాంతాల్లో సైతం పచ్చని అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతోందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెలంగాణ హరితోత్సవంలో భాగంగా శామీర్పేటలోని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్యతో పాటు జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాల్లో ముందుందని ఈ విషయంలో సీఎం కేసీఆర్ బృహత్తర ప్రణాళికలు, ముందుచూపు, దూరదృష్టి వల్లే ఇది సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ధి వేడుకల్లో భాగంగా రాబోయే తరాలకు మంచి వాతావరణం, పచ్చని చెట్లను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆయన మానసపుత్రిక అయిన తెలంగాణ హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం నాటిన మొక్కలను సంరక్షిస్తే అవి పెరిగి నీడనివ్వడంతో పాటు మంచి గాలిని అందిస్తాయని దీనిని దృష్టిలో పెట్టుకొని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి అలాగే వదిలేయకుండా వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని మంత్రి మల్లారెడ్డి సూచించారు. హరితహారం కార్యక్రమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలిచిందని.. అదే విధంగా రాష్ట్రంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మొదటి స్థానంలో నిలవడం ఎంతో ఆనందకరం, గర్వకారణమని మంత్రి మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లాకు కేటాయించిన మేరకు వంద శాతం మొక్కలు నాటే కార్యక్రమంలో సఫలీకృతులమయ్యామని అనుకున్న లక్ష్యాన్ని దాటి అంతకంటే ఎక్కువ మొక్కలు నాటామని అందుకు ప్రతి ఒక్కరి కృషి ఉందని మంత్రి అభినందించారు. జిల్లా వ్యాప్తంగా హరితహారంలో నాటిన మొక్కలు ప్రస్తుతం పెరిగి చెట్లు అయ్యాయని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పచ్చదనం పెరిగిందని.. మంచి ఆక్సిజన్ అందుతోందని ఇది ఎంతో ఉపయోగకరమని మంత్రి మల్లారెడ్డి సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతం కావడంతో పాటు రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని అందుకు ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలే ఉదాహరణలని ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. హరితహారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అని ఆ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా అధికారులందరూ కృషి చేశారని సమావేశంలో మంత్రి అభినందించారు. తెలంగాణ హరితోత్సవంలో మొక్కలు నాటి రాబోయే తరాలకు చక్కటి కాలుష్యం లేని వాతావరణం కల్పించిన వారమవుతామని వారికి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అన్నారు. అలాగే మొక్కలు పెరిగిన తర్వాత చెట్లుగా మారి భూగర్భజలాలు పెరగడంతో పాటు నీటి సమస్యలు తలెత్తకుండా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి వివరించారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్ది మట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు గా భావించి ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుండి కోట్లాది మొక్కలు నాటి సంరక్షించడంతో పచ్చదనం ఫరిఢ విల్లుతున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని శరత్ చంద్రారెడ్డి అన్నారు. అలాగే జిల్లాలో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన అధికారులందరినీ ఆయన అభినందించారు.
ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా హరితహారం కార్యక్రమం,
విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంచండి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ,
జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ హరితోత్సవం ఎంతో విజయవంతంగా నిర్వహించామని ఈ విషయంలో అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేసి పచ్చదనం పెంచడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుకు లక్షలాది మొక్కలు నాటి భావితారాలకు అందివ్వాలని తెలిపారు. అలాగే మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేలా చూడాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాలో తెలంగాణ హరితోత్సవం విజయవంతమైందని దీంతో పాటు హరితహారంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయిన హరితోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి విజయవంతం చేయడం పట్ల కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను, విద్యార్థులను అభినందించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సమన్వయంతో అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవో రవి, జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్,
ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, ఆయా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.