వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 20:
సోమవారం తెల్లవారుజామున రెండు గంజాయి రవాణా చేయడంతో పాటు విక్రయాలు చేస్తున్న గంజాయి స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన వివరాలను వరంగల్ సిపి ఏవి రంగనాథ్ తెలియజేశారు. ఎండు గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మిల్స్ కాలనీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఏసిపి ఎం జితేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు, మిల్స్ కాలని పోలీసులు సంయుక్తంగా ఖిలా వరంగల్ రాతికోట దగ్గర తనిఖీలలో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో కంభంపాటి సుమంత్, పాకాల సాయికుమార్, ములుగు వికాస్ అలియాస్ విక్కీ, అనే ముగ్గురు అనుమానాస్పదంగా తర్చాడుతో కనిపించడంతో వారిని తనిఖీ చేయగా ముగ్గురు వద్ద మూడు కిలోల ఎండు గంజాయి కనిపించడంతో నిందితులను అరెస్టు చేసి గంజాయిని స్వాధీన పరుచుకున్నారు. పై ముగ్గురిని పోలీసులు విచారించగా శివనగర్ కు చెందిన కంభంపాటి సుమంత్ పై అనేక కేసులు యిప్పటికీ నమోదు అయి ఉన్నాయి. సుమంత్ కరీంనగర్లో ఉంటూ కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటూ ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నాడు. గంజాయి కొనుగోలు చేసేందుకు కరీంనగర్ నుండి బయలుదేరే సమయాన తన పాత స్నేహితులు పాకాల సాయికుమార్, విక్కిలకు సమాచారం అందించి వరంగల్, మహబూబాద్, భద్రాచలం మీదుగా ఒరిస్సాలోని కలిమెలా కి స్కూటర్ మీద చేరుకొని అక్కడ గంజాయి కొనుగోలు చేసి అక్కడ నుండి వరంగల్ కి చేరుకొని అవసరమైన వారికి 100 గ్రాముల చొప్పున గంజాయిలను ప్యాకెట్ల రూపంలో తయారుచేసి ఒక్కో ప్యాకెట్ 500 నుండి 1000 రూపాయల చొప్పున అమ్మకాలు కొనసాగిస్తున్నారనీ పేర్కొన్నారు. ఎవరికి అనుమానం రాకుండా శివనగర్ కాశిబుగ్గ కరీమాబాద్ కిలా వరంగల్ చింతల్ లేబర్ కాలనీలలో యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయిని విక్రయిస్తునారు. అక్కడితో ఆగకుండా ఇంకా డబ్బులు ఎక్కువగా సంపాదించాలనే ఉద్దేశంతో స్కూలు, కాలేజ్ విద్యార్థులకు గంజాయి తాగడం అలవాటు చేస్తూ ఆ విద్యార్థులతోనే గంజాయి ప్యాకెట్లను విక్రయించెల తయారు చేసి వారితో అక్రమ గంజాయి విక్రయాలను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిని 15 మందిని గుర్తించినట్లుగా సిపి వెల్లడించారు. ఇప్పటికే 13 మందిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని కీలక సమాచారం రాబట్టడం జరిగిందని అన్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో గంజాయి తాగే వారిని 150 మందిని గుర్తించినట్లు తెలిపారు. గంజాయి తాగే వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిగా పెట్టడం జరిగిందని గంజాయి అమ్మే వారు వరంగల్ డివిజన్ పరిధిలో కేవలం ఈ ఒక్క నెలలో 6 కేసులు నమోదు చేశామని 14 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వరంగల్ నగరంలో గంజాయి ఉత్పత్తులు అక్రమ రవాణా, అమ్మకాలు , చేసే వారిపై ఉక్కు పాదం మోపడం జరుగుతుందని తల్లిదండ్రులు కళాశాలల యాజమాన్యం పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారి ప్రవర్తనలో ఏదైనా తేడా గమనిస్తే మాదాకా ద్రవ్యాలు వినియోగించినట్లయితే ప్రారంభంలోనే పోలీసులకు తెలియజేయాలని తద్వారా ఆదిలోనే పిల్లలు మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా చూడవచ్చని పేర్కొన్నారు. గంజాయి స్మగ్లింగ్ ఉంటాను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎసిపి జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ఎస్సై లు లవన్ కుమార్, నిస్సార్ పాష, కానిస్టేబుళ్లు రాజేష్, రాజు, బిక్షపతి, శ్రవణ్ కుమార్, శ్రీనివాస్, నవీన్ లను పోలీస్ కమిషనర్ అభినందించారు.