నిర్మల్ జిల్లా కేంద్రంలో పిచ్చికుక్కల దాడి ముగ్గురికి గాయాలు

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ పట్టణంలోని గాజులపేట, గంజ్ బక్షీ,బైల్ బజార్ ప్రాంతాలలో రోజువారీగా వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగి స్థానికుల పై దాడులు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుక్కల దాడులు నిర్మల్ పట్టణంలో కూడా మొదలవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.పై ప్రాంతాలలో ఆదివారం రాత్రి ఒకేసారి పిచ్చికుక్కలు ముగ్గురు పై దాడులు చేసి తీవ్ర గాయాల పాలు చేశాయి.ఈ ఘటనలో. అజ్గరి బేగం అనే వృదురాలు.ఆ తర్వాత రిమ్ షా అనే బాలికపై, వినాల్ రాథోడ్ అనే యువకుడు పై దాడి చేశాయి.గమనించిన స్థానికులు పిచ్చి కుక్కలను తరిమి కొట్టారు బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్కలను నివారించడంలో నిర్మల్ పురపాలక శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందనకా తప్పదు. ఇప్పటికే పట్టణంలోని ఆయా ప్రాంతాలలో పిచ్చి కుక్కల దాడులలో గాయాల పాలైన వారి సంఖ్య పదులలో లేకపోలేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు ఈ విషయంలో తక్షణం చర్యలు తీసుకొవాలి అని స్థానికులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking