మార్చి 26న జరిగే జైభారత్ సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి!

 

….జైభారత్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్మయ్య
సంగారెడ్డి మార్చి:20(ప్రజ బలం ప్రతినిది):
ఎస్సీ, ఎస్టీ, బీసీల జరుగుతున్న అన్ని రకాల అన్యాయాలను, అసమానతలను ఎదుర్కొనేందుకు జైభారత్ ఉద్యమం అధ్వర్యంలో ఈ నెల 26న సంగారెడ్డిలో జరుగుతున్న జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పేరిట రాష్ట్ర సదస్సును ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని జైభారత్ రాష్ట్ర కార్యదర్శి కశాపాగ ఇమ్మయ్య కోరారు.
సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సు కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ మార్చి 26న సంగారెడ్డిలోని అంబేడ్కర్ భవన్ లో జరిగే జైభారత్ తెలంగాణ సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర సదస్సు అణగారిన వర్గాల హక్కులకై పోరాటం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమానికి విజయవిహారం పత్రికా సంపాదకులు ముఖ్య అతిథిగా ఖదిజ్ఞాసి రమణమూర్తి, జైభారత్ జాతీయ నాయకత్వం పాల్గొననున్నాట్టు తెలిపారు.
ఈ సదస్సు విజయవంతానికై స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క జైభారత్ కార్యకర్త ముందుండి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జైభారత్ జిల్లా నాయకులు ప్రసాద్, TSF రాష్ట్ర కార్యదర్శి లక్ష్మన్ గారి వేణు గోపాల్. కృష్ణ. టి.జె.యు జిల్లా అధ్యక్షులు డి.అశోక్ తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking