కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని,
జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు కోర్ట్ లో తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిది కిస్టాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రం లో భార్యను చంపిన భర్త కేసులో నిందితునికి 50,000 రూపాయల జరిమానా మరియు జీవిత ఖైదు పడేలా కృషి చేసి శిక్షల శాతాన్ని పెంచి బాదితులకు న్యాయం జరిగేలా కృషి చేసిన మెదక్ జిల్లా కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ షేక్ ఫజల్ అహ్మెద్ గారిని, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ శ్రీ.విట్టల్ ఎస్.ఐ. గారిని, కానిస్టేబుళ్లు శ్రీ.లక్ష్మా రెడ్డి గారిని ,రవీందర్ గౌడ్ గారిని, శాలువాతో సత్కరించి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ.. నేర రహిత సమాజ ముగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా కోర్టు పోలీసు సిబ్బంది శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు,సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు పోలీసు అధికారుల పనితీరులో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కోర్ట్ కానిస్టేబుల్ అధికారులు తమ వీధిలో భాగంగా ఎప్పటికప్పుడు ఎన్.బి.డబ్లూ.(నాన్ బేలబుల్ వారెంటులను) క్రమం తప్పకుండా అమలు పరిచి నేరస్తులకు శిక్షలు పదేవిధంగా కృషిచేయాలని, కన్విక్షన్ రేటును మరింత పెంచాలని అన్నారు,
కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, కోర్టు నందు ఎఫ్ఐఆర్ లను సరైన సమయంలో అందించాలి. కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీని సరైన సమయంలో కోర్టు నందు డిపాజిట్ చేయాలి. కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషిచేయాలని, నేరస్తులకు వారంట్స్, సమన్స్, సత్వరమే ఎగ్జిక్యూటివ్ అయ్యే విధముగా చర్యలు తీసుకోవాలని, కోర్టు ప్రాసిక్యూషన్ కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు తెలియజేయాలని, కోర్ట్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని మరియు కేసు ట్రయల్స్ సమయములో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు సూచనలు స్వీకరించాలని, కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్స్, సమన్స్, సి.సి.టి.యన్.యస్ లో సి.యం.యస్ (కోర్ట్ మానిటర్ సిస్టమ్) లో డాటా ఎంటర్ చేయలని సూచించారు. కోర్టు కానిస్టేబుళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని తెలిపారు. భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, భాదితులకు మరింత నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సి.ఐ.శ్రీ.శ్రీధర్ గారు, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ మరియు కోర్ట్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.