తూప్రాన్ పాత కూరగాయల మార్కెట్లో ఎక్కడ చెత్త అక్కడే.

 

అభివృద్ధిలో దూసుకుపోతున్న తూప్రాన్ మునిసిపాలిటీ ఇదేనా

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ వ్యాపారస్తులు, విక్రయ దారులు 13వ. వార్డు కాలనీవాసుల ఆవేదన.. పాతకూరగాయ మార్కెట్లో కుళ్లిపోయిన కూరగాయలు, గొర్రెల, మేకల, చేపల, వ్యర్ధపదార్థాలతో చెత్తాచెదాలతో పేరుకుపోయి ఉన్నదని, వ్యాపారస్తులు బస్తీలో నివాసముంటున్న కుటుంబాల బస్తీ వాసులకు అనేకమైన దోమలు వ్యాప్తి చెందినాయని వీటి వలన రాత్రులు నిద్ర పోలేక ఇబ్బందులకు గురవుతున్నామని మురికి వాసనతో ఇంట్లో ఆహారం భుజించలేకపోతున్నామని ఈ వ్యర్థ పదార్థాల వలన ఇంట్లో ఉన్న చిల్లపిల్లలకు, ముసలి వారికి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని వారి ఆవేదనను వెలిబుచ్చారు.

తూప్రాన్ మున్సిపల్ అధికారులకు సంబంధిత కౌన్సిలర్ కు పలుమార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని, కూరగాయలు అమ్మే వ్యాపారులు , స్థానిక వ్యాపారులు బస్తీలోని పలువురు తమ ఆవేదనను తెలిపారు. దీనివలన వ్యాపారస్తులకు, విక్రయ దారులకు బస్తిలోని కుటుంబాలలో నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా చూడాలని తూప్రాన్ మున్సిపల్ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పడమే కాదు ఆచరణలో పెట్టాలని సీజనల్ వ్యాధులతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని బస్తీలోని పలువురు మహిళలు, యువకులు వారి ఆవేదనను తెలిపారు. కూరగాయ విక్రయదారులు పేరుకుపోయిన చెత్త చెదారని స్వయంగా వారి చేతులతో వారే శుభ్రంచేసుకున్నారు. మరియు మున్సిపల్ అధికారులు సఫాయివారు పట్టీంచుకోవడంలేదని వారి బాధను ఒక ప్రకటన ద్వారాపేర్కొన్నారు.
ఇకనైనా జిల్లా అధికారులు ప్రభుత్వ పెద్దలు ఇక్కడున్న చెత్తను డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking