భద్రాద్రి వాసికి దక్కిన ఆరుధైన గౌరవం.

– ప్రముఖ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బుడగం శ్రీనివాస్ సతీమణికి ఆంగ్ల విభాగంలో డాక్టరేట్.

– కాకతీయ విశ్వవిద్యాలయం నుంచీ డాక్టరేట్ ప్రధానం చేసిన ఆచార్య నరసింహాచారి.

– డాక్టరేట్ పొందిన బుడగం మంజుల దేవికి అభినందనల వెల్లువ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నవంబర్ 22 (ప్రజాబలం ) :—

భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, టీపీసీసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బుడగం శ్రీనివాస్ సతీమణి బుడగం మంజులా దేవికి అరుదైన గౌరవం లభించింది..”సాహిత అకాడమీ అవార్డు విన్నింగ్ నోవెల్స్ ఎతిమెటిక్ స్టడీ ఆఫ్ సెలెక్ట్ ఇంగ్లీష్ నొవెల్స్” అనే అంశంపై లోతైన పరిశోధన పూర్తిచేసి పరిశోధన తీతీస్ సమర్పించిన ఆంగ్ల విభాగ పరిశోధకురాలు బి మంజుల దేవికి కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహచారి డాక్టోరేట్ ప్రధానం చేశారు.పరిశోధకురాలు డాక్టర్ బి మంజులాదేవి పరిశోధన ఆధారంగా లింగ అణచివేత, పేదరికం, సామాజిక స్థాయి పెరుగుదల కోసం పోరాటం, పాత విలువలతో కొత్త విలువల మధ్య మెలుకువ వంటి అంశాలు ప్రతిబంబించటమే కాక భారతీయ సాంస్కృతిక సంక్లిష్టత, చారిత్రక సంఘటనలు, వర్గ విభజన వంటి విభిన్న అంశాలను ఈ రచనలు ప్రతిపాదించాయని మంజుల దేవి రచనలు సాంఘిక, రాజకీయ, ఆర్థిక చారిత్రక అంశాలను అధికంగా
విశ్లేషించనున్నా యని సీనియర్ ఆచార్యులు కె.పురుషోత్తం ఈ సందర్భంగా కొనియాడారు.
పురస్కార గ్రహీత బుడగం మంజుల దేవి ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం పట్టనానికి చెందిన ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బుడగం శ్రీనివాస్ సతీమణి గా అందరికి సుపరిచితురాలు..యల్లప్పుడు రాజకీయాల్లో ,వ్యాపారాలలో బిజీగా ఉండె భర్తకి మద్దతుగా తోడుగా కుటుంబ భాద్యతలను సక్రమంగా నిర్వర్తించే గృహిణిగా వుంటూనే, భర్త సహకారంతో ఉద్యోగ భాద్యతలను సక్రమంగా నిర్వర్తిస్తు ఇటువంటి అత్యున్నత పురస్కారాలు అందుకోవడం భద్రాద్రి వాసులకు గర్వకారణం అని పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఆమె కుమారుడు కుమార్తేలని ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దడంలో తనవంతు కృషి యనలేనిదని ,ధాని ఫలితంగానే కుమారుడు రోహిత్ ఆస్ట్రేలియాలో సిగ్నల్ ఇంజనీర్ గా రైల్వేస్ లో ఉద్యోగం,కుమార్తే రిషిత ఇటీవలె ఉస్మానియాలో ఎంబిబిఎస్ పూర్తి చేయడము జరిగిందని పలువురు కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking