ఇల్లందకుంట ప్రజా బలం ప్రతినిధి నవంబర్ 22
తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మండల కేంద్రంలో నూతన ఓటర్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఇల్లందకుంట తాసిల్దార్ రాణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు మీ గ్రామంలో తేదీ 23 నవంబర్ 2024, 24 నవంబర్ 2024 రెండు రోజులు ప్రత్యేకంగా ఓటరు నమోదు కోసం ఎఫ్ 6, 7, 8, సంబంధించిన అర్జీలను స్వీకరించడానికి, గ్రామాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ పోలింగ్ లో అందుబాటులో ఉంటారని ఈ యొక్క అవకాశాన్ని నూతనంగా ఓటు హక్కు పొందే యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ తెలిపారు.