జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 22
జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షులు ఊకంటి మల్లాచారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర యువత కో ఆర్డినేటర్ అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ వేములవాడ మహాశివునికి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరాలని మొక్కులు సందర్భంగా ఈ నెల 27 వ తేదిన జరగబోయే విజయ సంకల్ప మహా పాదయాత్రలో ప్రతి ఉద్యమకారుడు స్వచ్ఛందంగా పాల్గొనాలని తెలపడం జరిగింది. అదే విధంగా గత ప్రభుత్వం ఉద్యమకారుల త్యాగాల మీద పునాదులు వేసుకొని ఉద్యమకారులను అణిచివేసిందని ఉద్యమ గలాన్ని నొక్కి వేసిందని మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యమకారులను హక్కును చేర్చుకొని 250 గజాల స్థలాన్ని ఇవ్వడం కోసం ముందుకు వచ్చిందని కొనియాడారు. నాడు ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మరువలేనిదని సబ్బండ వర్గాల ప్రజలు ఏకతాటి మీదకి వచ్చి జై తెలంగాణ అనే నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపారని యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే చాటి చెప్పిన ఘనత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డదని అన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులపై అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం చిన్న చూపు చూసిందని, ఉద్యమకారులు జీవితాలను సైతం పణంగా పెట్టారని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో పునాదిరాళ్లుగా ఉన్నటువంటి ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నారు. ఎంతో మంది తమ ప్రాణాలను కుటుంబాలను వదిలి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారని గతాన్ని గుర్తు చేసారు.తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి, యువత రాష్ట్ర కో ఆర్డినేటర్ అన్నం ప్రవీణ్, ఊకంటి మల్లాచారి నియోజకవర్గ అధ్యక్షులు, పొట్టాల మల్లేష్, కందె మహేందర్, చింతల రాజిరెడ్డి, సంఘే గట్టయ్య, గురుకుంట్ల రాజీరు, గుడికందుల రాజయ్య, ఆరే రమేష్ రెడ్డి, గోశెట్టి సమ్మయ్య, నేరెళ్ల కుమార్, లెంకలపల్లి శరత్ కుమార్, మద్దూరి శంకరయ్య, రావుల రాజబాబు, అంజన్న, పోడేటి అనిల్ ,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.