మాల మహానాడు జిల్లా కన్వీనర్ తొగరు సుధాకర్
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ నవంబర్ 22 : చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ డిసెంబర్ 1న హైదరాబాద్ లో మాలమహానాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాలల సింహగర్జన సభను జిల్లాలోని మాలలందరు పాల్గొని విజయవంతం చేయాలని మాల మహానాడు జేఏసీ జిల్లా కన్వీనర్ తొగరు సుధాకర్ మాలలకు పిలుపునిచ్చారు.శుక్రవారం పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో మాల మహానాడు ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా అయన స్థానిక నాయకులతో కలిసి మాట్లాడుతూ…డిసెంబర్ 1 హైదరాబాద్ లో జరిగే మాలల సింహగర్జన సభను మాలలంతా విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,దమ్మ నారాయణ,తోగరు కాంతయ్య,దొంత నరసయ్య,మాలెం చిన్నయ్య,భూపెల్లి మల్లేష్,బైరం లింగన్న, తొగరు రాజు,అలుగునూర్ నరేష్,పెండెం సత్తయ్య, రవీందర్,మినుముల శాంతి,గుత్తికొండ శ్రీధర్, సన్నీ,కండె మొగిలి, సురేష్,తదితరులు పాల్గొన్నారు.