బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తికి ఘన సన్మానం.

కరీంనగర్ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ఎస్ శ్రీ వాణి కరీంనగర్ నుండి సికింద్రాబాద్ ఎస్సీ ఎస్టీ కోర్టుకు బదిలీ పై వెళుతున్న సందర్భంగా కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పివి రాజ్ కుమార్ బేతి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలోని మెడియేషన్ సెంటర్లో వీడుకోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి బి ప్రతిమ హాజరైనారు. పలువురు సీనియర్ న్యాయవాదులు కుసుంబా కృష్ణా రావు, కె సంజీవరెడ్డి, కిరణ్ కుమార్, తునికి పవన్ కుమార్, దేవేందర్ రెడ్డి, రమణ రావు, తణుకు శ్రీరాములు, రావూఫ్ ,లింగంపెల్లి నాగరాజ్, లు మాట్లాడుతూ న్యాయ మూర్తి శ్రీ వాణి కరీంనగర్ జిల్లా లో మొదట మున్సిఫ్ మెజిస్ట్రేట్ గా, తర్వాత ప్రమోషన్ పై జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తిగా, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా మంచి గుర్తింపు పొందారని, జిల్లాకు వచ్చి రెండు సంవత్సరాల ఎనిమిది నెలల్లో 2100 కేసుల ను డిస్పోజల్ చేశారని , రాబోయే కాలంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కరీంనగర్ కు రావాలని, హైకోర్టు జడ్జిగా చూడాలని కరీంనగర్ న్యాయవాదుల తరపున కోరుకుంటున్నామని తెలిపారు. న్యాయమూర్తి శ్రీవాణి మాట్లాడుతూ కరీంనగర్ న్యాయవాదులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదని, కేసుల విషయంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృజ్ఞతలు తెలుపుతూ, అదే విధంగా కొత్తగా వచ్చిన మెజిస్ట్రేట్ లకు కేసుల విషయంలో న్యాయవాదులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కరీంనగర్ బార్ అసోసియేషన్ కార్యవర్గం బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తి శ్రీ వాణి గారికి పూల బోకే ,శాలువా లతో ఘనంగా సన్మానించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, మహిళా న్యాయవాదులు న్యాయమూర్తికి శాలవ తో సన్మానించారు. ఈ వీడ్కోలు కార్యక్రమానికి అదనపు జిల్లా న్యాయమూర్తులు, మెజిస్ట్రేట్లు, సీనియర్ జూనియర్ న్యాయ వాదులు, మహిళ న్యాయ వాదులు, న్యాయవాదుల గుమస్తాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking