ఐ .వి.ఎఫ్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లకు ఘన సన్మానం

 

ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారదులు

ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్ జర్నలిస్టులు

ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ట్రెజరర్ కొడిప్యాక నారాయణ గుప్త

 

తూప్రాన్, సెప్టెంబర్, 6.

సమాజంలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించి వార్తలు సేకరించి ప్రచురిస్తున్న జర్నలిస్టుల జీవితం దన్యమని ఐ.వి.ఎఫ్ రాష్ట్ర కోశాధికారి, తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ కోడిప్యాక నారాయణ గుప్త అన్నారు.
ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం తూప్రాన్ లోని శివ శివాని ఫంక్షన్ హాల్ లో జర్నలిస్ట్ డే పురస్కరించుకొని తూప్రాన్ జర్నలిస్ట్ లకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా కోడిప్యాక నారాయణ గుప్త మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యంలో నాలుగో స్థoభం జర్నలిస్టులు అని అలాంటి ఉత్తమ జర్నలిస్ట్ లను సన్మానించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ.వి.ఎఫ్ జిల్లా నాయకులు నీల ప్రవీణ్ కుమార్ గుప్త, ఉప్పల నర్సింలు గుప్త, కమటల రాజుగుప్త, చంద నారాయణగుప్త, గబ్బుల సిద్ధిరాములు గుప్త, కోవూరు శ్రీనివాస్ గుప్త, కమటాల రాజేశ్వరి గుప్త, పడకండి శ్రీనివాస్ గుప్త, చంద నారాయణ గుప్త, పడకంటి శ్రీనివాస్ గుప్త, కొడపాక చిన్న నారాయణ గుప్త, గంగం శ్రీనివాస్ గుప్త, కోవూరు శ్రీనివాస్ గుప్త,సీనియర్ జర్నలిస్ట్ నాయకులు జానకిరామ్ సిఆర్, పి ఆంజనేయులు గౌడ్, సి ఆర్ పుర్నరాజ్ గౌడ్, జి భాస్కర్ గౌడ్, పి నగేష్ గుప్త, కంటాయపాలెం వేణుగోపాల్, సిహెచ్ రామస్వామి, మచ్చ యాదగిరి, రాజశేఖర, సందీప్, గౌసుద్దీన్, గడ్డం ప్రశాంత్, రాగిశెట్టి శ్రీనివాస్, వెంకట కృష్ణగౌడ్, లయన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking