వెస్లీ పాఠశాల ఉపధ్యాయులకు ఘన సన్మానం

 

ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ సెప్టెంబర్ 5:
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని మాజీ సైనికుడు, తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం వెస్లీ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాచారం సిఐ రుద్విర్ కుమార్,లయన్స్ క్లబ్ నాచారం ఎలైట్ అధ్యక్షుడు రాజా రెడ్డి,లు హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల కు ఫ్యాన్ల ను బహుకరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ . విద్యార్థులను ఉన్నత స్థాయిలో రూపొందించడంలో కీలకపాత్ర ఉపాధ్యాయులదేనని కొనియాడారు. విద్యార్థులను తీర్చిదిద్దడం లో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సన్మానించడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, లోకేందర్ రెడ్డి, ఇఎచ్ ఆర్ మోహన్, శేఖర్ రెడ్డి, జూపల్లి నరేష్, రాజు గుప్త, సాయి ప్రసాద్ రెడ్డి, గురు, విజయ్ కుమార్ సింగ్, సాయి చండ్,శేషు,స్రవంతి,శ్రీనాథ్,శ్రీధర్,మహేష్, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking