ప్రజాబలం దినపత్రిక – నిజాంపేట్ మండల్
05-09-2024:
మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గల రిషిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది… ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి రాదా కృష్ణ విద్యా రంగానికి చేసిన సేవలను గురించి విద్యార్థులకి వివరించడం జరిగింది అన్నారు…. ఈ కార్యక్రమం లో కరెస్పాండంట్ బి. స్వామి అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొన్నారు..
ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5వ తేదీన జరుపుకుంటారు. మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాము అని తెలిపారు