బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సన్మానించిన మిత్ర బృందం

 

వేములవాడ- ఏప్రిల్ 11 (ప్రజాబలం దినపత్రిక)
వేములవాడ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులను కోర్టు ఆవరణలో వారి మిత్రబృందం శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ గుజ్జే మనోహర్, లైబ్రరీ సెక్రటరీ పంపరి శంకరయ్య, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా గెలుపొందిన కనికరపు శ్రీనివాస్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంపరి నాగరాజు, తోట అనిల్, జయారపు అంజయ్య , లింగాల సుదర్శన్, పులి మల్లేశం,సోయినేని శ్రీకర్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking