👉జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 11(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సంగారెడ్డి:మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా, సంగారెడ్డి ఎమ్.ఎల్.ఎ క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సి.దామోదర రాజనర్సింహ, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో కలిసి మహాత్మా పూలమాల వేసి ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,జ్యోతిరావు ఫూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త, విద్య, మహిళా సాధికారత మరియు అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన న్యాయవాది అన్నారు,ఫులే జీవితం,ఆయన బోధనలు అందరికీ మార్గదర్శకం అని,సమానత్వం,న్యాయం మరియు సామాజిక సామరస్యం యొక్క విలువలను నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అటువంటి గొప్ప వ్యక్తులకు నివాళులు అర్పించడం అంటే వారి మార్గాన్ని అనుసరించడం మరియు మెరుగైన సమాజం కోసం పనిచేయడమే అని ఎస్పీ అన్నారు.