కూకట్పల్లి (ప్రజాబలం) ఏప్రిల్ 11 :
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావు నగర్ లో శుక్రవారం కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జరుగుతున్న నాలా అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో అదనంగా మంజూరు చేసిన 1కోటి 30 లక్షల వ్యయంతో నాలా విస్తరణ పనులు జరుగుతున్నాయని, లోతట్టు ప్రాంతమైన రామారావు నగర్ లో నివసిస్తున్న ప్రజలు ఎన్నో ఏళ్ల తరబడి నాలా సమస్యను ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే కృషితో నాలా సమస్య నుండి విముక్తి కలిగేలా కృషి చేస్తున్నారని అన్నారు, అలాగే పనుల పురోగతిని అధికారులతో అడిగి తెలుసుకోవడం జరిగిందని పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, వెంకటయ్య యాదవ్, ఆవుల సంజీవ, ముక్తార్, సాంబ శివ, సత్యనారాయణ, కరుణాకర్, యోగి రాజు, తదితరులు పాల్గొన్నారు.