ఖమ్మం ప్రతినిది ఏప్రిల్ 13 (ప్రజాబలం)ఖమ్మం దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు
దరిపల్లి అనంత రాములు కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్ కుమార్ మాట్లాడుతూ మా కుమ్మరి ముద్దుబిడ్డ, మట్టిలో మాణిక్యం పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి డాక్టర్ దరిపల్లి రామయ్య గారు మా బాబాయి, నాకు ఊహ తెలిసిన అప్పటినుంచి మొక్కలు నాటాలి, మొక్కలు పెంచాలి, మొక్కలను సంరక్షించాలని, రామయ్య గారు ఎండాకాలం సమయంలో వృక్షాల నుంచి కిందపడిన విత్తనాలు సేకరించి వాటిని భద్రపరచి తొలకరి చినుకులు పడ్డప్పుడు కొండలు, గుట్టలు, లోయలు, నీటి సౌకర్యం ఉండే దగ్గర, సాగర్ కెనాల్ పక్కన విత్తనాలను వెదజల్లి, మొక్కల సంరక్షణకు పరితపించేవాడు. నిజమైన భూమి పుత్రుడు అని పర్యావరణ పరిరక్షణలో ఆయనది నిస్వార్థ సేవ అని, వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగంగా చేసుకుని కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం యొక్క ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ భువనగిరి చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ మా బాబాయి డాక్టర్ దరిపల్లి రామయ్య ను అందరూ వనజీవి రామయ్య గా పిలుస్తూ ఉంటారు. మొక్కలు నాటడానికి చెట్ల సంరక్షణకు తన జీవితాన్ని దారబోసిన అసాధారణ ప్రకృతి ప్రేమికుడు, పచ్చని వనాల కోసం ఆరు దశాబ్దాల పాటు పరితపించిన మహనీయుడు తన ఇంటి పేరుని వనజీవిగా మార్చుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ దరిపల్లి రామయ్య అని అన్నారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అసోసియేషన్ ఫైనాన్స్ సెక్రటరీ, శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన వనజీవి డాక్టర్ దరిపల్లి రామయ్య కృషి స్ఫూర్తిదాయకమైంది. నేటి తరానికి ఆయన ఆదర్శప్రాయులు అని ప్రకృతి పర్యావరణం లేనిది మానవ మనుగడ లేదు అనే సిద్ధాంతాన్ని వనజీవి డాక్టర్ దరిపల్లి రామయ్య గారు బలంగా నమ్మారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తంగా సమాజాన్ని ప్రభావితం చేశారు. తదనంతరం వనజీవి డాక్టర్ దరిపల్లి రామయ్య పార్థివ దేహానికి ఖమ్మం జిల్లా పల్లెగూడెం రెడ్డిపల్లి పల్లె ప్రకృతి వనం వైకుంఠ దామం నందు అంతిమ వీడ్కోలు చేసి నివాళులు అర్పించి సంతాపం తెలియజేశారు. వారి భార్యా పిల్లలకు మనోధైర్యాన్ని నింపి ఎప్పుడూ మీకు తోడుగా ఉంటామని అన్నారు. ఆయనకు గుర్తుగా అతని సమాధి వద్ద ఒక మొక్కను నాటారు. వనజీవి డాక్టర్ దరిపల్లి రామయ్య, ఈ లోకం విడిచి వెళ్లిన గాని అతని ఆత్మ ప్రతి మొక్కలోను ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెయిన్ బో సంస్థ, హైదరాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లెల మాధవరావు మాట్లాడుతూ వనజీవి డాక్టర్ దరిపల్లి రామయ్య గారు ఎండాకాలంలో విత్తనాలు సేకరించి వానాకాలం తొలకరి నందు విత్తనాలు నాటుతూ వృక్ష సంపదలను పెంచారని అన్నారు. రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్ మరియు ఖమ్మం జిల్లా కుమ్మరి సంఘం నాయకులు మల్లెల లక్ష్మీపతి, వనజీవి డాక్టర్ దరిపల్లి రామయ్య శిష్యులు వృక్ష ప్రేమికులు, స్వచ్ఛ ప్లాంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ సురేష్ గుప్తా తోపాటు వరంగల్ జిల్లా నుండి దేశం కోసం ప్రకాశ్, నిజామాబాద్ నుండి గ్రీన్ జనార్ధన్, నల్గొండ సిరిసిల్ల జిల్లా నుండి ప్రకృతి ప్రకాశ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి రాజశేఖర్ పాల్గొన్నారు
