ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే ఉద్యమ బాటే

టిజిఇజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ( TGEJAC ) కార్యవర్గ సమావేశం టీఎన్జీవోస్ భవన్లో జరిగింది ఖమ్మం జిల్లా వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాష్ట్రం లో కూడా 5 డి.ఎ లు పెండింగ్లో లేవని మన రాష్ట్ర చరిత్రలో కూడా ఇప్పటివరకు ఐదు డి.ఏలు పెండింగ్ లో ఉన్నట్లు ఎప్పుడు లేదని వెంటనే పెండింగ్ డి.ఎ లు విడుదల చేయాలని అన్నారు త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ జేఏసీ తో చర్చిస్తుoది అని అన్నారు

             

త్వరలోనే ఉద్యోగుల సదస్సు ఖమ్మంలో పెద్ద ఎత్తున నిర్వహించి రాష్ట్రంలో రోల్ మోడల్ గా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిజిఇజేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు కన్వీనర్ కస్తాల సత్యనారాయణ కో-చైర్మన్ లు పిఆర్టియు జిల్లా అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు రాయల నరసింహారావు యూటీఎఫ్ సెక్రటరీ పారుపల్లి నాగేశ్వరరావు టిజిఇజేఏసీ రాష్ట్ర కో- చైర్మన్ దేవరకొండ సైదులు రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరి సునీల్ రెడ్డి పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామునూరి రాజేష్ టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విజయ్, హెడ్మాస్టర్స్ అసోసియేషన్ సంఘ అధ్యక్షులు వీరస్వామిటిఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్ టిజిఓస్ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి ఎంపీఓస్ అసోసియేషన్ మల్లెల రవీంద్ర ప్రసాద్ ఎస్జీపిఏటీ జిల్లా అధ్యక్షులు పరిస పుల్లయ్య పెన్షనర్స్ సంఘం ఎం.సుబ్బయ్య పి.పుల్లయ్య , డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ బాబు రత్నాకర్, టి.పి.టిఎఫ్ టి. వెంగళరావు ఎస్.టి. ఎఫ్ జి .యాదగిరి, ఎస్టియు దొడ్డ వరప్రసాదరావు టి.జి. పి.ఆర్.టి యు మట్ట శ్రీనివాసరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బిక్కు, డ్రైవర్ల సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, టీజీజెఎల్ఏ సెక్రటరీ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు ఎస్టిఎఫ్ జనరల్ సెక్రెటరీ ఎస్కే మన్సూర్, టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, పంచాయతీ సెక్రెటరీ అసోసియేషన్ బి .తిరుపతిరావు ఎన్ రమేష్ గవర్నమెంట్ డ్రైవర్స్ అసోసియేషన్ ఎస్వీ ప్రసాద్ కే వేణుగోపాల్ ఐ.జి.ఎస్ రాజు అంగన్వాడి టీచర్స్ అసోసియేషన్ భవాని, పద్మ , రఘుపతి విజయ కుమారి మల్లేశ్వరి, నాగమణి, విజయలక్ష్మి,ఆశా వర్కర్స్ అసోసియేషన్ ఈ.కరుణ కే. రమణ పోలీస్ అసోసియేషన్ ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ఏప్రిల్ ఒకటి నుండి జిల్లా స్థాయిలో జరిగే కార్యాచరణ మేరకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించడం ఖమ్మం జిల్లాలో రాష్ట్ర జేఏసీ నాయకులును ఆహ్వానించి పెద్ద ఎత్తున ఉద్యోగుల సదస్సును ఈ నెలలో నిర్వహించాలని కార్యవర్గ సమావేశం తీర్మానించినది ప్రభుత్వం వెంటనే పెండింగ్ డీ.ఎ లు , పెండింగ్ బకాయిలు వెంటనే ఉద్యోగులకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాచరణకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ ఆఫీసర్స్, కార్మికులు, పెన్షనర్స్ మరియు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో మద్దతునివ్వాలని ఖమ్మం జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది

Leave A Reply

Your email address will not be published.

Breaking