వేములవాడ లో వ్యక్తి దారుణ హత్య.

 

భయభ్రాంతులకు గురైన పట్టణవాసులు.

హంతకుల వీడియో వైరల్

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), ఆదివారం రోజున వేములవాడ పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురి అయిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు వేములవాడ రూరల్ మండలం నాగయ్య పల్లి గ్రామానికి చెందిన శెట్టిపల్లి పరుశురాం (36) అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలో నివాసం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులో గల మహా లింగేశ్వర గార్డెన్ లో ఆదివారం సాయంత్రం మద్యం సేవించే సమయంలో వారి మధ్య విభేదాలు రావడంతో శెట్టిపల్లి పరశురాం ను గొడ్డన్లు, కత్తితో నరికి చంపినట్లు తెలుస్తుంది. హత్య జరిగినా అనంతరం నిందితులు మారనాయుధాలతో ఇంస్టాగ్రామ్ లో హెచ్చరిస్తూ పోస్ట్ చేయడంతో అట్టి వీడియో వైరల్ గా మారింది. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలాన్ని వేములవాడ ఏ ఎస్ పి శేషాద్రిని రెడ్డి, వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, డాగ్ స్కాడ్ బృందంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి రాత్రి తరలించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking