నూకలమర్రి, వట్టెంల, ఫాజుల్ నగర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.
వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), ఆదివారం రోజున వేములవాడ రూరల్ మండలం లో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చే నూకలమర్రి, పట్టెంల, ఫాజుల్ నగర్ గ్రామాలలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఐకెపి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా తల్లులను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 50% కొనుగోలు కేంద్రాలను వారికి కేటాయించారని వెల్లడించారు. రైతులకు న్యాన్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఏకకాలంలో రైతు ప్రయోజనాల కోసం 21 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేయడం జరిగింది అని వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యం పంపిణీ చేయడం కోసం అదనంగా నూతన లారీ ఏజెన్సీ లకు ఇవ్వడం జరిగింది అని తెలిపారు.
సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్కు అదనంగా 500 రూపాయలు ఇస్తున్నదని తెలిపారు. గతంలో వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంది అని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని, టార్పాలిన్ కవర్లు, గన్ని సంచులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొంటామని అని తెలిపారు.
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట.
ప్రజా ప్రభుత్వంలో మహిళా తల్లులను కోటీశ్వరులు చేయడం కోసం హిందీలో మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సుమారు 600 కోట్ల పైసలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేయడం జరిగింది అన్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో మహిళా సమైక్య సంఘాలకు బస్సులు మంజూరు చేస్తే వేములవాడ రూరల్ మండలం మహిళా సమాఖ్య కు 30 లక్షలతో బస్సు మంజూరు చేయడం జరిగింది అని తెలిపారు. మహిళలు ముందుకు వస్తే రైస్ మిల్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. రాజీవ్ యువకిరణాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల రైతులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.