ఏపీ హైకోర్టు జస్టిస్, రాజస్థాన్ రాష్ట్ర హైకోర్టు జస్టిస్, తో కలిసి వచ్చి రాజన్నను దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్.
వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ ఏ. హరి హర నంద శర్మ, రాజస్థాన్ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ ఎం. లక్ష్మణులతో కలిసి, రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ ఎం.తుకారాంజి లకు సిరిసిల్ల జిల్లా జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, మరియు వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి జ్యోతి కిరణ్మయి, రాజన్న ఆలయ ఈవో కె. వినోద్ రెడ్డి, వేములవాడ తాసిల్దార్ కే. విజయ ప్రకాష్ రావులు, పూల మొక్కలు అందజేసి ఆహ్వానించిన అనంతరం జిల్లా పోలీసు గార్డ్ ఆఫ్ ఆనర్ తో సత్కరించారు, సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.
ఆలయ ప్రోటోకాల్ ఏ ఈ ఓ అశోక్ కుమార్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంత్ చార్యులు, మరియు ఆలయ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
