హబ్సిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఆర్థిక వేత్తగా, న్యాయ కోవిదునిగా, రాజనీతిజ్ఞునిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అంటరానితనం, వివక్షలపై ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హబ్సిగూడ డివిజన్ సీనియర్ నాయకులు కరిపే అనిల్ కుమార్ వంజరి, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కంది శ్రవణ్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, హబ్సిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ధర్మేందర్ నాయక్, చింతల బాబురావు, జిల్లా ఎస్టీ సెల్ నాయకులు గణేశ్ నాయక్, శివరాజ్, మురళీకృష్ణ ముదిరాజ్, రాజన్న, సోలమన్ బాబు, వాసు నాయక్, నర్సింగ్ రావు, జావేద్, సంపత్, లక్ష్మీనారాయణ, కృష్ణ, మల్లు నాయక్, సయ్యద్, సాయికిరణ్, సుమన్ నాయక్, జయరాజ్, సాయి, కలీం, అఖిల్, టీంకు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.