జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా …
భారీగా మోహరించిన పోలీసులు
బి.సి లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
కేంద్ర ప్రభుత్వం బీసీల బడ్జెటు 2 లక్షల కోట్లకు కేటాయించాలని డిమాండ్
న్యూ డిల్లీ ఏప్రిల్ 3 ;పార్లమెంట్ లో బిసి బిలు పెట్టాలని ,బి.సి లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి బర్జేట్ ను2 లక్షల కోట్లకు పెంచాలని, కేంద్రం లో బి.సి లకు ప్రతేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన బీసీ లు మహా ధర్నా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలనుండి వందలాది మంది వివిధ బిసి సంఘాలు, అనుబంద సంఘాలకు చెందినా నేటు కార్యకర్తలు హాజరైనార్టు.అంతకు ముందు పార్లమెంటు వద్ద ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్బంగా భారీ ఎత్తున పొలిసు బలగాలను మొహరించారు.ఈ సందర్బంగా ధర్నాను ఉద్దేశించి ఆర్, కృష్ణయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ – పార్లమెంట్ ఎన్నికలలో బి సి లకు అన్ని రాజకీయ పార్టీలు బి సి లకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు. బి.సి లకు అన్యాయం చేసే పార్టీల బరతం పడతామని హెచ్చరించారు.అన్ని రాజకీయ పార్టీలు బి సి లను ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారు. రాజ్యాధికారంలో వాట ఇవ్వకుండా 75 సం.లుగా అన్యాయం చేస్తూన్నారు. జెండాలు మోసుకుంటు, జిందాబాద్ ల నినాదాలు ఇస్తూ బిసిలను వాడుకుంటున్నారని విమర్శించారు. బి సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతం పెంచాలని,త్వరలో జరుపబోయే జనాభా గణనలో కులాల వారి లెక్కలు తీయాలని డిమాండ్ చేసారు.అలాగే బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని,బి.సి ల విద్య – ఉద్యోగ రిజర్వేషన్లు పై యున్న క్రిమిలేయర్ ను తొలగించాలని డిమాండ్ చేసారు.. బి.సి లకు పారిశ్రామిక పాలసీ లో 50 శాతం కోటా ఇవ్వాలని. హై కోర్టు – సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో SC/ST/BC- రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలనిప్రైవేటు రంగం లో SC/ST/BC లకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసారు. ఈ మహా ధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం,డిల్లీ ఇంచార్జ్ కర్రి వేనుమాదవ్, తెలంగాణా రాష్ట్ర కన్వినర్ లాల్ కృష్ణ, తెలంగాణా బిసి సంఘం అద్యక్షులు సి.రాజేందర్, బిసి ఇక్యవేదిక అద్యక్షులు అనంతయ్య,నిరుద్యోగ జేఏసి చర్మెన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణపు శ్రీనివాస్, నల్లగొంగ జిల్లా అద్యక్షులు దుడుక లక్ష్మి నారాయణ, బిసి విద్యార్ధి సంఘం తెలంగాణా అద్యక్షులు అంజి, బిసి విద్యార్ధి సంఘం తెలంగాణా వర్కింగ్ ప్రిసిడెంట్ బోల్కం వెంకట్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వేముల రామ కృష్ణ, సందీప్ గౌడ్, హరీష్ యాదవ్, తిరుపతి, సైదులు, సతీష్, నాగరాజు, రామస్వామి, బోయిన్ పృద్వి, రామరాజు, రాజేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు