నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఖమ్మం అసెంబ్లీకి జావీద్ దరఖాస్తు

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 25 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ ఖమ్మం అసెంబ్లీ స్థానానికి దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి కాలువడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ పై ప్రజలు విసుగు చెందారని తెలంగాణ ప్రజానీకం రాష్ట్రంలో మార్పు కోరుకుంటుందని స్పష్టం చేశారు. యువనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో మల్లికార్జున్ కార్గే సారథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని టిఆర్ఎస్ నేతలు ఇండ్లకే పరిమితమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జ్యోష్యం చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో 30% పథకాలు కమిషన్ దార్లకే అని విమర్శించారు. ఏ ఒక్క వర్గాన్ని కూడా కేసీఆర్ బాగు చేయలేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అదోగతి పట్టించాడని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని కచ్చితంగా తెలంగాణలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking