సెప్టెంబర్ 15లోగా ఖరీఫ్ పంట రుణాల లక్ష్యాన్ని సాధించాలి
…….. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి, ఆగస్టు 25 ప్రజ బలం ప్రతినిది:
బ్యాంకర్లు నిర్దేశించిన రుణ లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రస్తుత ఆర్థిక సవత్సరంలో జూన్ త్రైమాసకం వరకు జరిగిన ప్రగతిపై బ్యాంకర్లతో డిసిసి మరియు డి ఎల్ ఆర్ సి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ఖరీఫ్ వంట రుణాల లక్ష్యాన్ని సెప్టెంబర్ 15లోగా సాధించాలని బ్యాంకర్లకు సూచించారు.
ఆర్థిక మద్దతు పథకాల కింద ఎస్సీ, ఎస్టీలకు మంజూరైన పెండింగ్ యూనిట్లను ఈ నెలాఖరులోగా గ్రౌండింగ్ చేయాలని కోరారు.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యం ఆగస్ట్ మాసంతానికి 50 శాతం అచీవ్ కావాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రసుత సంవత్సరం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద నిర్దేశిత రుణాలు అందిoచాలని బ్యాంకర్లను కోరారు.
నూతన పరిశ్రమలు స్థాపనకు అర్హులైన లబ్ధిదారులకు లక్ష్యం మేరకు పిఎంఈజిపి, పిఎంఎఫ్ఎంఈ , రుణాలు అందించాలన్నారు.
పెన్షన్, రైతుబంధు, ఎస్సీ, ఎస్టీల సబ్సిడీలు లాంటివి అప్పు కింద జమ చేసుకోవద్దని స్పష్టం చేశారు.
బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో సమిష్టిగా పని చేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు సంబంధించి మొత్తం రూ.2494.97 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు ఎల్ డి ఎం గోపాల్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు గాను రూ.871.16 కోట్లు,
ప్రాధాన్యతరంగాలకు సంబంధించి రూ.1571.47 కోట్లు,ప్రాధాన్యేతర రంగాలకు సంబంధించి రూ. 1023.50 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు వివరించారు.
రైతు రుణమాఫీ లో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో 67,188 మంది రైతుల ఖాతాలో 340.47 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా లీడ్ మేనేజర్ గోపాల్ రెడ్డి, నాబార్డ్ ఏ జిఎం క్రిష్ణ తేజ, జెడ్పీ సీఈవో ఎల్లయ్య,డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు,వ్యవసాయ శాఖ జేడి నరసింహారావు,పరిశ్రమల శాఖ మేనేజర్ ప్రశాంత్, మెప్మ పిడి గీత, ఎస్సి,ఎస్టీ, బిసి, మైనారిటీ, మత్స్య, ఉద్యాన తదితర శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.