గౌతమ్ గౌడ్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అనాధాశ్రమంలో ఫ్రూట్స్ బిస్కెట్లు, స్నాక్స్ బట్టలు పంపిణీ చేసిన బిఆర్ఎస్ నాయకులు.

 

తూప్రాన్, ఆగస్ట్,25. ప్రజా బలం న్యూస:-

బి అర్ ఎస్ మెదక్ జిల్లా నాయకుడు, యువనేత వర్గంటి గౌతమ్ గౌడ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు అనాథ ఆశ్రమం లో మానసిక వికలాంగుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆశ్రమం లో ఉన్న మానసిక వికలాంగులకు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్ లు, స్నాక్స్ మరియు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ రాష్ట్ర నాయకులు మన్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ యూత్ నాయకులు గౌతమ్ గౌడ్ అందరితో కలిసిమెలిసి ఉంటూ ప్రజాదారిలో పొందిన వ్యక్తిని , గౌతమ్ కుటుంబము వారి పిల్లలు దేవుని ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉండి సమాజానికి మరింత సేవలు అందించాలని మాట్లాడుతూ తెలిపారు స ఈ కార్యక్రమంలో గౌతమ్ గౌడ్ తో పాటు తెలగాణ ఉద్యమ నాయకులు మన్నే శ్రీనివాస్ రావు, మాజీ ఎంపిటిసి తిమ్మాపురం నర్సింలు ముదిరాజ్, మాజీ ఉప సర్పచ్ నర్సింలు, యూత్ ప్రెసిడెంట్ సాయి ప్రసాద్, దామోదర్ రెడ్డి, అనాధాశ్రమం సంరక్షకులు, ప్రజా ప్రతినిధులు తదతరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking