ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 20 : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి జర్నలిస్టులు అని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు.బుధవారం పట్టణంలో నూతన ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. సమాజాన్ని చైతన్యపర్చడంలో మీడియా పాత్రికేయుల పాత్ర ఎంతో గొప్పదన్నారు.సత్యానికి దూరం ఉండకుండా నిజాలను మాత్రమే ప్రజలకు తెలియజేయాలన్నారు. సమాజంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి జర్నలిస్టులు కృషి చేయాలే కాని నాయకులపై బురదజల్లే వార్తలు రాయకుండా మంచి వార్తలు రాయాలన్నారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విలేకరులు సాంకేతికతతో ముందుకు సాగాలని సూచించారు.మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్వలాభం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాత్రికేయుడు తన కలంతో పోరాడి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.జడ్పిటిసి ముత్తె సత్తయ్య మాట్లాడుతూ గడిచిన కొన్ని సంవత్సరాలలో విలేకరులకు ఒక ప్రత్యేకమైన అడ్డ లేకపోవడంతో ప్రెస్ మీట్ కార్యక్రమాలకు పార్టీలకు, సంఘాలకు ఆటంకం తలెత్తిందన్నారు.ప్రెస్ క్లబ్ భవన ఏర్పాటుతో ఈ సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు. సీఐ ఆర్ కృష్ణ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో పాత్రికేయ వృత్తి నాలుగో స్తంభమని, ప్రజా సమస్యల పరిష్కారంలో వీరు చేస్తున్న సేవలు మరువలేనివి అన్నారు.ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోనగిరి కుమార్ మాట్లాడుతూ… జర్నలిస్ట్ లు సమాజహితం కోసం పని చేస్తారని,ప్రెస్ క్లబ్ భవన్ నిర్మాణానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్ర రావు, ఎంపిడిఓ నాగేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్,జైలర్ స్వామి, ఏ ఓ ప్రభాకర్ రెడ్డి,మబీ ఆర్ ఎస్ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్,మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేష్,సర్పంచ్ లు గోళ్ళ రవీందర్,రాగుల రాజేశం, కౌన్సిలర్స్ మెట్టు కళ్యాణి రాజు,సురేష్ నాయక్,పలు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు,అధికారులు, అనాధికారులు,పలు కుల సంఘాల నాయకులు,ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చెరుకు వేణుగోపాల్,గౌరవ అధ్యక్షుడు కొండపర్తి ప్రసన్న,ఉపాధ్యక్షులు చీకటి తిరుపతి,తిరుమలేష్, సౌడం రాజు,సందీప్,నోవా, భానుచందర్,కోశాధికారి సందీప్ యాదవ్,సలహాదారుడు ఎస్ వేణుగోపాల్,ప్రచార కార్యదర్శులు కాదిర్,రమేష్, షాహిద్,పాత్రికేయులు నంది తిరుపతి,సతీష్,సుధాకర్, మధు,సత్యం,అంజలి,వెంకటేష్, మహేష్,షాకీబ్,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.