డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి ప్రజాబలం 20 సెప్టెంబర్:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమానికి గురువారం రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, ఆర్డీవో శ్యామ్ప్రకాశ్తో కలిసి దుండిగల్‌లోని డబుల్ బెడ్రూమ్ల వద్ద ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ కుత్భుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్‌లో గురువారం రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రెండో విడత డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిందిగా అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.