హైదరాబాద్ సెప్టెంబర్ 20 (); ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి గారికి రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ సీనియర్ అడ్వైజర్ కమిటీ సభ్యులు బెజవాడ సుబ్బలక్ష్మమ్మ, డా. సుప్రియ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ఐటి మినిస్టర్ మేకపాటి గౌతంరెడ్డి తల్లిగారు మేకపాటి మనీ మంజరి హైదరాబాద్ జిల్లా శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ అభివృద్ధికి కొరకు 50,000 రూపాయలు విరాళం అందించారు. పేదల అభ్యున్నతి కోసం మరియు జన ఔషధీ షెటర్స్ నిర్మాణం కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ భీమ్ రెడ్డి గారు బ్లడ్ బ్యాంక్ అభివృద్ధి నిర్మాణం కొరకు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తన వంతుగా విరాళం అందించిన మనీ మంజరి గారికి సుబ్బలక్ష్మమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.