క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, సిపి ఏవి రంగనాథ్,

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 20:

క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానిక దోహద పడతాయని సిపి ఏవి రంగనాథ్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యలు పేర్కొన్నారు.
బుధవారం వరంగల్ ఓ సిటీ మైదానంలో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 75 వసంతాలు పూర్తిచేసుకుని వజ్రోత్సవ వేడుకల నిర్వహిస్తున్న తరుణంలో ఓసిటి స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను వరంగల్ జిల్లా పోలీస్ కమిషనర్
ఏవీ రంగనాథ్ ఐపీఎస్, మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు .
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాపారస్తులకు, పరిశ్రమదరులకు, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.వసామాజిక బాధ్యతతో
వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ వరంగల్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని కోరారు. చారిత్రాత్మకమైన వరంగల్ నగరం విశిష్టత కలిగి ఉన్నదని కాకతీయ మెగా టెక్సటైల్ పార్క్ పారిశ్రామిక
జోన్ గా ఉన్నదని, జిల్లాలో రైతులు నాణ్యమైన పత్తి, మిరప పండిస్తారని, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో పోటీ తత్వాన్ని ఎదుర్కొనాలంటే మంచి ఉత్పత్తులని ఎన్నుకోవాలని చెప్పారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారుల సేవకే అంకితం కాకుండా వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర కల్పించడంలో వాతావరణ ప్రతికూల సమయాలలో వరంగల్ ప్రజలకు అండదండగా నిలుస్తూ మరియు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొంటూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నదని ఛాంబర్ సామాజిక సేవలను అభినందించినారు.
ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించినారు .
జిల్లాలో వ్యవసాయ రంగంలో రైతులు అద్భుత ప్రగతి నాణ్యమైన వ్యవసాయం వలన బహుమతులు వస్తున్నాయి, దీనికి తోడుగా ప్యాకింగ్ ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాలని చెప్పారు.
ఈ సందర్భంగా సిపి రంగనాథ్ మాట్లాడుతూ 75 సంవత్సరాల క్రితం చాంబర్ ఆఫ్ కామర్స్ రూపకల్పన జరిగిందని అంచెలంచెలుగా వారి సామాజిక సేవా దృక్పథం తో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సేవలు మరువలేనివని అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ 14 అసోసియేషన్స్ కలవని వ్యాపారంలో సమస్యలు అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సత్వర పరిష్కార మార్గాలు చూపాలంటే అది ఒక్క చాంబర్ ఆఫ్ కామర్స్ వారికే సాధ్యమని చెప్పారు.
భారతదేశం త్వరలో3rd ఎకనామిక్ వరల్డ్ గా తయారయ్యే ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని
చెప్పారు. ప్రస్తుతము ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థల స్థాపన ఊపు అందుకుంటున్నదని నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా అభివృద్ధి చెందుతున్న వ్యాపార వ్యవస్థలో పాలుపంచుకోవాలని కోరారు. ఇదే ఉత్సాహంతో వ్యవసాయదారులకు వ్యాపార వర్గాలకు సేవలు చేస్తూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ బొమ్మినేని రవీందర్ రెడ్డి ,ఉపాధ్యక్షులు మొగిలి చంద్రమౌళి , గౌరవ ప్రధాన కార్యదర్శి మడూరి వేద ప్రకాష్, సంయుక్త కార్యదర్శి
సాగర్ల శ్రీనివాస్ , కోశాధికారి అల్లే సంపత్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు , దిడ్డి కుమార స్వామి , కంభంపాటి కుమార స్వామి, కటకం పెంటయ్య, మాజీ గౌరవ ప్రధాన కార్యదర్శులు గోరంట్ల యాదగిరి, తోట నరసింహారావు, కరాని స్పైసెస్ యజమాని రవి కరాని, కార్యవర్గ సభ్యులు కైలాస హరినాథ్ గారు సుధాటి రాజేశ్వరరావు గారు,గాజుల సుమన్ గారు శ్రీ కంచ సంపత్ గారు, గౌరిశెట్టి శ్రీనివాస్ గారు కో ఆప్షన్ మెంబర్రాయిశెట్టి, సత్యనారాయణ గారు సలహాదారులు భూపతి ప్రభాకర్ , వెల్ది చక్రధర్ , పుప్పాల యుగంధర్ , చాంబర్ అనుబంధ సెక్షన్ల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, గుమస్తా దడువాయి, హమాలి, కార్మిక సోదరులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking