వరంగల్ ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 20:
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దేశాయిపేట రోడ్డు వర్తక సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాధుని సన్నిధిలో నిత్య అన్నదాన కార్యక్రమం రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. దేశయి పేట రోడ్ వర్తక సంఘం శాశ్వత అధ్యక్షులు ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం అన్నదానం దాతలు దొడ్ల శ్రీలత రాజిరెడ్డి ప్రదీప్ రెడ్డి చందన, స్వాతి రాజేంద్రప్రసాద్ ల సహకారంతో 309 మంది అన్నార్తులకు గణపతి ఆన్న ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలలో నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులతో కలిసి తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. వర్తక సంగం తరపున కొలువైన గణనాథుడు కోరిన కోరికలు తీరుస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో గణనాధుని తలుచుకోవడంతోపాటు అన్నదాన ప్రసాదానికి బారులు తీరుతున్నారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ వి ఎస్ జిల్లా కార్యదర్శి వి విజయ భాస్కర్ రెడ్డి, కోశాధికారి , శిరూప మదన్ కుమార్, మార్గం నాగరాజు, కనుగంటి అశోక్, గోరంటాల రవి, నేరెళ్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.