ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. పార్థసారథి రిటైర్డ్ ఐఏఎస్, తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ ఆర్జీయూకేటీ బాసరను సందర్శించిన సందర్భంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, భైంసా ఏఎస్పి కాంతిలాల్ పాటిల్ , ఆర్జీయూకేటి డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్, పూల మొక్కతో సాదరంగా స్వాగతం పలికారు. తదనంతరం పోలీస్ వారి నుండి గౌరవ వందనం స్వీకరించి, పరిపాలన భవనంలో తేనీరు సేవించిన తదనంతరం స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్ కి ఆడిటోరియంలో చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డైరెక్టర్ సతీష్ కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ శ్రీ పార్థసారథి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం ఎంతో గర్వకారణం. మానసిక వికాసాన్ని, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అనేక వేదికల పైన ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని సాఫీగా కొనసాగించడానికి సూచనలు చేసిన వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ ఆర్జీయూకేటీ బాసర విద్యార్థులను చూస్తుంటే నా ఇంజనీరింగ్ విద్యార్థి దశ గుర్తుకొస్తుందని నేను ఈరోజు పార్థసారధి ప్రసంగం వినడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పార్థసారథి రిటైర్డ్ ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం ఎలా? సాంకేతిక రంగంలో నైపుణ్యాలు సాధించుకోవడం ఎలా అనే అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపి వారికి బహుమతులను అందజేయడం జరిగింది. విద్యార్థులు భవిష్యత్తును నిర్దేశించుకోవడంలో ఎటువంటి సందేహాలు ఉండకుండా ముందుకు సాగిపోవాలని పిలుపునిచ్చారు. పార్థసారథి స్వీయ జీవితాన్ని ప్రస్తావిస్తూ చమత్కారంగా మాట్లాడారు. మన చుట్టూ ఉన్న సమాజమే మనల్ని ప్రభావితం చేస్తుందని దాంతో మానసిక వికాసం, విశ్లేషణ నైపుణ్యాభివృద్ధి రైతుల అంశాలను విపులంగా వివరించారు. భారతదేశంలో ఉన్న వారి యొక్క మేధో శక్తి ఎంతో గొప్పదని ప్రతి రంగంలో రాణించడానికి గల కారణం మనలో ఉన్న శక్తి సామర్థ్యాలేనని ఉదహరిస్తూ తెలిపారు. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ గారి జీవితాన్ని ఉదాహరించారు. ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ నూతన ఆలోచనలతో ఆవిష్కరణలు సాధ్యమవుతాయని, ఉపాధి ఉద్యోగ అవకాశాలు నైపుణ్యాల పైనే ఆధారపడి ఉంటాయని తెలిపారు. నేటి సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు ఎంతో పెను మార్పులను తీసుకొస్తుందని దాంతో సాంకేతిక విప్లవం విరాజిల్లుతుందని వివరించారు. నేటి జీవన విధానంలో అనేక మార్పులు చేర్పులు రావడానికి గల కారణం సాంకేతికంగా పురోగతి సాధించడమేనని తెలిపారు. నేడు సాంకేతిక విద్యార్థులదే పెద్దపీట. 21వ శతాబ్దంలో నైపుణ్యాలతో కూడినటువంటి కోర్సుల అవశ్యకతను వివరించారు. విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని కోర్సుల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. లెర్నింగ్ బై డూయింగ్ నేర్చుకుంటూ పనిచేయడం అనే నినాదంతో విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. మనం చదివే చదువు ఉపాధి కల్పించే మార్గాలను అన్వేషించాలని దానికి సృజనాత్మకత తోడు అవ్వాలని దాంతో ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు ముందుకొస్తాయని తెలియజేశారు. విషయాన్ని అందరికీ పంచాలి అనే నినాదంతో ముందుకెళ్లిన మేధావులైనటువంటి యూట్యూబ్ నుంచి మైక్రోసాఫ్ట్ తదితర 25 సంస్థల సీఈఓ లు మన భారతీయులైనని అది మనందరి గర్వకారణమని కొని ఆడారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో నేడు సూపర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కొత్తకోణాన్ని ఆవిష్కరించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ సి ఇ వినోద్ రెడ్డి ,బాసర ఎస్సై గణేష్
సమన్వయకర్త రాజేష్ రెడ్డి, అధ్యాపకులు హరిబాబు, డాక్టర్ పావని, డి పి ఆర్ ఓ శ్రీమతి తిరుమల, శ్రీమతి సృజన, బద్రి నారాయణ, హరికృష్ణ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్ అన్ని బ్రాంచీల మూడవ సంవత్సర విద్యార్థులు : ముధోల్ సీఐ వినోద్ రెడ్డి, బాసర ఎస్సై గణేష్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.