పిలిస్తే పలికే నేత.. మీ శీనన్న

ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటారు

కాంగ్రెస్ యువనేత పొంగులేటి హర్షా రెడ్డి

కూసుమంచి మండలంలో ముమ్మర పర్యటన

ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

-బైక్ పై తిరుగుతూ, అందరినీ పలుకరిస్తూ ప్రచార బాట

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి ఏ సమస్య ఎదురైనా, ఏ ఇబ్బంది వచ్చినా శీనన్నా అని పిలిస్తే వెంటనే పలికే నేత మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తనయుడు, కాంగ్రెస్ యువనేత పొంగులేటి హర్షా రెడ్డి అన్నారు. గురువారం కూసుమంచి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయాన్నే ఇక్కడికి చేరుకొని స్థానిక శివాలయం లో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు భారీగా హాజరై ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓ దశ దిన ఖర్మకు హాజరై చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత బైక్ ర్యాలీగా బయలుదేరి.. శ్రేణుల్లో ఉత్సాహo నింపారు. అందరినీ పలకరిస్తూ, కరచాలనాలు చేస్తూ.. ఆత్మీయంగా కలిసిపోయారు. ఈ సందర్భంగా పొంగులేటి హర్షారెడ్డి మాట్లాడుతూ.. పొంగులేటి శీనన్న జనం మనిషని, నిత్యం ప్రజాసేవలోనే తపిస్తారని తెలిపారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలతో మమేకం అవుతాడని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking