ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు భావన రూషి ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం లో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ అధికారుల మన్ననలు పొందారని పోలీస్ కమీషనర్ కొనియాడారు రిటైర్ మెంట్ తన వృత్తికే కాని తన వ్యక్తిత్వానికి కాదని మీ విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు పదవీవిరమణ చేసిన మీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన సంప్రదించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో హోంగార్డ్ ఆర్ ఐ సురేష్ ఖమ్మం జిల్లా హోంగార్డ్ ఆఫీసర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, రవి, వేంకటేశ్వర్లు, పాల్గొన్నారు.