ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్ల ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల సమయంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించిన అన్ని వివరాలను మార్పులు, చేర్పులకు సంబంధించిన పూర్తి సమాచారంతో అధికారులు సిద్దంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్నుంచి జిల్లాలోని ఆయా శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై చర్చించి అవసరమైన పలుసూచనలు, సలహాలు అందేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ అసెంబ్లి ఎన్నికల దృశ్యా ఎన్నికల ప్రవర్తన నియావళి ఉల్లంఘనలు జరగకుండా పటిష్టచర్యలు తీసుకునే క్రమంలో జిల్లాలొ ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది అందరు విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఫారం–6,7,8కు సంబంధించి డిస్పోజల్స్ను ప్రతిరోజూ చేయాలని ఎక్కడ కూడా పెండింగ్ ఉండకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. దీనికి సంబంధించి అవసరమైన చోట సిబ్బందిని పెంచి త్వరగా పూర్తి చేయాల్సిందిగా తెలిపారు. అలాగే జిల్లాలో ఉన్న ఐదు శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు తదితర విషయాలపై రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. జిల్లాలో స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ హాల్స్ కు సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలను తనకు త్వరగా పూర్తి వివరాలతో డిటైల్స్ పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలన ఈ విషయంలో ఒకటికి రెండుమార్లు క్షుణ్ణంగా అన్ని విషయాలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాల్సిందిగా గౌతమ్ అధికారులకు తెలిపారు. జిల్లాలోని స్ట్రాంగ్రూమ్ల ఆవరణలో, ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ గురించి తెలుసుకోవాలని కౌంటింగ్ కు ముందుగానే సిబ్బందిని గుర్తించి ఎంపిక చేయాల్సిందిగా జిల్లా ఎన్నికల, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను సంబంధిత అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక తయారు చేసి తనకు పంపించాల్సిందిగా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ జరిగేలా చూడాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వివరించారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో ఫ్లయింగ్ స్వ్కాడ్, ఎస్ఎస్టీ, వీఎస్టీ టీమ్ల వివరాలను నియోజవర్గ స్థాయిలో ఎన్నెన్ని ఉన్నాయి అనే వివరాలను ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అడిగి తెలుసుకొన్నారు. దీనికి సంబంధించి టీమ్లు, వాహనాలు, తదితరాలు అవసరమైతే వెంటనే సమకూరుస్తామని తెలిపినారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణ తదితర పనులకు అవసమైన ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేసుకోవాలని అందుకు సంబంధించి ప్రతి రోజూ రిపోర్టును తనకు పంపించాలని గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ఈవీఎమ్ మ్యానువల్ పూర్తిగా తెలుసుకొని ఉండాలని… మరో రెండు మూడు రోజుల్లో ఈవీఎమ్లపై ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుందని అందుకు అవసరమైన సిబ్బంది వివరాలను సిద్దంగా ఉంచాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వివరించారు. అలాగే ఎన్నికలకు సంబంధించి అబ్జర్వర్లు, ఖర్చుల వివరాలకు సంబంధించిన అధికారులు పరిశీలనకు వస్తుంటారని వారికి అధికారులు సహకరించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిందిగా జిలా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking