తూప్రాన్, జనవరి4 (ప్రజా బలం న్యూస్):
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ గ్రామంలో సాయంత్రం సమయంలో ఇండ్ల మధ్యలో కుమ్మరి నర్సింలు అనే వ్యక్తి తనకు సంబంధించిన గడ్డివాము పశుగ్రాసం 250 పైగా గడ్డి మోపులు కొనుక్కుని బండ పైన పేర్చుకున్నడు. సాయంత్రం సమయాన మంటలు చెలరేగడంతో గమనించిన నర్సింలు కుటుంబీకులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు భారీగా చెలరేగడంతో పూర్తిగా కాలిపోయింది. ఇది పశువులకు కావలసిన గ్రాసం ఇది ఎవరో కావాలని తగులపెట్టరాని నర్సింలు తన భాదను వ్యక్త పరిచారు.