నిర్మల్ జిల్లాకు కొత్త ఎస్పీ .డాక్టర్ జి.జానకి షర్మిల

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా జిల్లాకు ఎస్పీగా బదిలీ ఉత్తర్వులు తీసుకున్నటువంటి డాక్టర్ జి.జానకి షర్మిల ఐపీఎస్.ఇది వరకు ఎస్పీగా కొనసాగిన. చల్లా ప్రవీణ్ కుమార్.నుండి జిల్లా ఎస్పీగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై హోంగార్డు స్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న.చల్లా ప్రవీణ్ కుమార్.తో జిల్లాకు సంబంధించిన శాంతిభద్రతల వివరాలను గూర్చి చర్చించారు. నూతనంగా బదిలీపై వచ్చిన ఎస్పీ ని కలిసేందుకు జిల్లాలోని పోలీస్ అధికారులు పోలీస్ కార్యాలయానికి విచ్చేసి పుష్పగుచ్చాన్ని అందించి మర్యాదపూర్వకంగా కలిశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking