గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 24 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామ శివారులో వెంకటేశ్వర బ్రిక్స్ ముందు జాతీయ రహదారిపై అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని దండెపల్లికి చెందిన అల్వాల కోటయ్య అనే 55సంవత్సరాల వ్యక్తి మృతిచెందాడు.మృతుడు నిన్న జెండవెంకటాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి దండెపల్లి నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయాలై చనిపోయాడు.మృతునికి పెళ్లి కాలేదు.మృతుని అన్న అల్వాల రాజన్న పిర్యాదు మేరకు లక్షెట్టిపేట ఎస్సై-2 రామయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking