మతి స్థిమితం లేని వ్యక్తి ఆరు నెలల తర్వాత ఇంటికి..

 

ప్రజాబలం- మెదక్ నియోజకవర్గ ప్రతినిధి

24 ఆగస్టు 2024 :

మెదక్ జిల్లా తూప్రాన్ మండలానికి చెందిన వ్యక్తి మతి స్థిమితం లేక దారి తప్పిన మానసిక దివ్యాంగుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన మెరుగు గాడ్సన్‌ జాషువా మొదటి కుమారుడు బ్లెస్సెన్‌ రాజు (20) మతిస్థిమితం లేని మానసిక దివ్యాంగుడు.
2024 జనవరిలో హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న పెద్ద నాన్న సెల్వ రాజు వద్దకు వచ్చాడు. అదే నెల చివరి వారంలో తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో పోలీసులకు దొరికాడు.
వారు శివ్వంపేట మండలంలోని బేతాని ఆశ్రమంలో అప్పగించగా అక్కడే ఉంటున్నాడు. జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌, మెదక్‌ పోలీసులు ‘దర్పనేప’లో వివరాలు నమోదు చేశామన్నారు. అందులో భాగంగా తల్లిదండ్రులను గుర్తించి వారికి సమాచారం అందించామని ఎస్‌ఐ తెలిపారు. ఆరు నెలల తర్వాత కుమారుడు దొరకడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking