కనీస మద్దతు ధరల చట్టం చేయాలి

 

తెలంగాణ రైతు సంఘం డిమాండ్

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 2

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున స్థానిక గాంధీ చౌరస్తా వద్ద మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన మద్దతు ధరలు సహేతుకంగా లేవన్నారు. రోజురోజుకు పెరుగుతున్న రైతుల పెట్టుబడిని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. వెంటనే ప్రకటించిన ధరలను సవరించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది నిర్ణయించిన మద్దతు ధర లో కేవలం ఐదు శాతం మాత్రమే పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు 25 శాతం పెరిగాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి చూపిస్తుందని అన్నారు. పండించే అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూరగాయలకు కూడా మద్దతు ధరలు నిర్ణయించాలన్నారు. ధరలను నిర్ణయించడంతో పాటు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ముసలి కన్నీరు కారుస్తూ రైతుల నడ్డి విరుస్తుందన్నారు.రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు తెచ్చిన బిజెపి ప్రభుత్వం రైతు పోరాటాలకు తలోగ్గి ఆ చట్టాలను రద్దు చేసిందని గుర్తు చేశారు. రైతాంగానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదని, మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాసిర సంపత్ రావు, సహాయ కార్యదర్శి శీలం అశోక్, నాయకులుకొప్పుల శంకర్ జక్కుల రమేష్, రావుల ఓదెలు,కుమార్, సమ్మయ్య, సంజీవ్, పోచయ్య, కరుణాకర్, రమేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking