ఆకతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు పాత బస్‌స్టాండులో పోలీస్ ఆవుట్ పోస్ట్ ఏర్పాటు ఖమ్మం టౌన్ ఏసీపీ హరికృష్ణ
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 20 (ప్రజాబలం) ఖమ్మం నిత్యం రద్దీగా వుండే పాత ఆర్టీసీ బస్టాండ్ లో పోలీస్ ఆవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ హరికృష్ణ తెలిపారు. మద్యం మత్తులో ఆకతాయిలకు వాగ్వివాదాలు భౌతిక దాడుల వరకూ వెళుతున్నట్లు, ఆసాంఘీక కార్యాకాలపాలు జరుపుతున్నట్లు ఫిర్యాదు వస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని నిందుతులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ప్రతిరోజూ వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సుల కోసం వేచి వుండే ప్రయాణికులను ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ గస్తీ ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్‌లో నిరంతరం పోలీస్ పహారా ఉంటుందని ప్రయాణికులకు అవసరమైన సహాయసహకారం అందిస్తామని ఏలాంటి ఆందోళన చేందవద్దని ఏసీపీ పెర్కొన్నారు. ముఖ్యంగా పండుగవేళ దొంగల కదలికలు లేకుండా ముందస్తుగానే బస్టాండ్ పరిసరాలలో పోలీసుల పర్యవేక్షణ వుంటుందని ప్రయాణికుల ను అప్రమత్తం చేస్తూ పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ స్వామి పాల్గొన్నారు.