ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపుర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముత్యంపేట శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన బుధవారం నిర్వహించారు. కళాజత బృందం ఆట పాటల ద్వారా ప్రజలకు బ్యాంకు సేవల గురించి అవగాహన కల్పించారు. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోచన,అటల్ పెన్షన్ బీమా యోజన పథకాల గురించి గ్రామస్థులు తెలిపిరు. డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఏటీఎం పిన్ నెంబరు ఎవరికి చెప్పకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట బ్యాంకు మేనేజర్ అరుణ్ కుమార్ ఎమ్ వి రూరల్ ఫోక్ టీంమ్ క్యాషియర్ పి అయబ్ ఖాన్, బ్యాంకు సిబ్బంది స్వామి,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.