-అక్రమ మార్గంలో ఇసుక రావణ..
-అధికారుల ఆదేశాలు భేకాతర్..
ఏజెన్సీ చట్టాలకు తూట్లు
-అధికారులు జర దేకో
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి డిసెంబర్ 20 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట గుట్టు చప్పుడు కాకుండా ఇసుకను దోచేస్తున్నారు. ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టు తోడేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల సైతం బేఖాతర్ చేస్తున్నారు. ఏజెన్సీ చట్టాలను తూట్లు పొడుస్తున్నారు. అక్రమ మార్గంలో ఇసుకను ఎత్తుకెళ్లి వేల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డు అదుపు లేకుండా అర్ధరాత్రులు ఎవరు లేని సమయంలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లు లోడ్లు చేసుకుని ఇసుకను తీసుకెళ్లి పోతున్నారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో గల గాండ్లగూడెం గ్రామానికి సరిహద్దునున్న నారాయణపురం రోడ్డులో బ్రిడ్జి పరిసర ప్రాంతాలలో ఇసుకను పెద్ద ఎత్తున అక్రమ మార్గంలో తీసుకెళ్లి పోతున్నారు. ఎవరి పర్మిషన్ తీసుకోరు. ఎవరికి సమాధానం చెప్పరు. అడ్డొస్తే అంతే వారి ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తూ ట్రాక్టర్లు లో ఇసుకను ఎత్తుకెళ్లి పోతున్నారు ప్రభుత్వం స్పందించి ఉన్నతాధి కారులు జోక్యం చేసుకొని అక్రమ మార్గంలో తీసుకెళ్తున్న ఇసుకను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.