ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 20 (ప్రజాబలం) ఖమ్మం ఈ నెల 22న ఖమ్మం నగరం నందు గల భక్తరామదాసు కలాక్షేత్రం లో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి యువజ నోత్సావాలలో వివిధ కళారంగాలలో జరిగే పోటీలలో యువతి, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా యువజన క్రీడల అధికారి తుంబూరు సునీల్ రెడ్డి అన్నారు. బుధవారం సర్దార్ పటేల్ స్టేడియం లో జరిగిన యువజన సంఘాల నాయకుల సమావేశం లో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భారత దేశ సంస్కృతీ ని ప్రతిబింభించేవిధంగా ఈ పోటీలుంటాయని అన్నారు. జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి కి పంపించనున్నట్లు అయన తెలిపారు. ఈ పోటీలలో యువ కళాకారులను అధిక సంఖ్యలో హాజరైయేటట్లు యువజన సంఘాల నాయకులు చూడాలని అయన కోరారు. ఈ కార్యక్రమం లో యువజన క్రీడల శాఖ ఉద్యోగి హరిబాబు, యువజన సంఘాల సమితి సీనియర్ నాయకులు జక్కుల వెంకటరమణ, పగడాల కళ్యాణి, ఇరిగి ఉజ్వల, తాటిపల్లి సుధీర్, పగిడిమర్రి భాస్కర్ రావు, ప్రేమ్ సాగర్, భోగి అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.