ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముధోల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆర్. నవిత రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. అదిలాబాదులో జరిగిన ఉమ్మడి జిల్లా జోనల్ లెవెల్ అండర్-17 ఇయర్స్ బాల బాలికల కబడ్డీ టోర్నమెంట్ సెలక్షన్లో పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగింది. హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలలో విద్యార్థిని పాల్గొంటుంది. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ఆర్. నవితను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఎంపీపీ అయేషాఅఫ్రోజ్ ఖాన్, ఎంపీటీసీలు సరళ శ్రీనివాస్ గౌడ్, దేవోజి భూమేష్, పాఠశాల చైర్మన్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం మెరుగైన ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.